ఇలాగైతే ఎలా చంద్రబాబూ

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదు. ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వడం లేదు. అందుకే ప్యాకేజి కి అంగీకరించాం. దాంతో అభివృద్ధికి నిధుల కొరత ఉండదు అంటూ ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంతా బానే వుంది. కానీ అసలు ప్యాకేజీ ఏమిటి ? అందులో ఎంత కేంద్రం మంజూరు చేస్తుంది ? ఏ నిధులు ఎలా రాబోతున్నాయి అన్న వివరణ సీఎం ఇవ్వలేదు సరికదా ఒక క్లారిటీ మాత్రం ఇచ్చారు చంద్రబాబు.
ప్యాకేజీ లో ఎన్ని నిధులు వస్తాయో తెలియదన్న సీఎం ...
ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ తో ఏ మేరకు నిధులు దక్కుతాయో తెలియదని చెప్పడం తీవ్ర దుమారమే రేపుతోంది. సాక్షాత్తు సీఎం కే ప్యాకేజీ ఏమిటో, తద్వారా వచ్చే ప్రయోజనాలు ఏమిటో తెలియకపోతే రాష్ట్ర ప్రజలకు ఏమి చెబుతారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. కేంద్రం బెదిరింపులకు బాబు రాజీ పడటమే ప్రస్తుత అనిశ్చితికి కారణమని భావిస్తున్నారు. సీఎం అసెంబ్లీలో తన ప్రకటనలో మాత్రం రాష్ట్ర ప్రయోజనాలకోసం రాజీ పడేది లేదని పదే పదే ప్రకటించడాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యమే శరణ్యం అనే భావన ధ్వనిస్తుంది చెబుతున్నారు. మొత్తానికి హోదా నుంచి ప్యాకేజి జపం మొదలు పెట్టాకా తొలిసారి చంద్రబాబు కేంద్రం ఏమి ఇస్తుందో తెలియదంటూ ఒక నిజాన్ని అనుకోకుండా చెప్పేశారని విశ్లేషకులు పేర్కొనడం గమనార్హం.
- Tags
- చంద్రబాబు

