ఇప్పటికైనా బూతు సైట్లు ఆగిపోతాయా ...?

మీడియా అంటేనే బూతు అనేలా డబ్బు కోసం గడ్డితింటున్న నేరగాళ్ల ఆటను సిఐడి పోలీసులు చెక్ పెట్టారు . మా అసోసియేషన్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బెంగుళూరు లో నాలుగు అశ్లిల సైట్స్ నిర్వహిస్తున్న దాసరి ప్రదీప్ ను అరెస్ట్ చేశారు . సినీ సెలబ్రెటీల ఫోటోలు మార్ఫింగ్ చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్న వారికి త్వరలోనే అరదండాలు వేసే పనికి ప్రదీప్ తో శ్రీకారం చుట్టారు పోలీసులు. ప్రదీప్ ను విచారిస్తే మొత్తం బూతు సైట్స్ లిస్ట్ బయటకు వస్తుందని భావిస్తున్నారు . ఎవరో ఫిర్యాదు చేసే వరకు వేచి చూడకుండా సైబర్ క్రైం విభాగం ఎప్పటికప్పుడు ఈ చెత్త ను ఏరిపారేయాలని టాలీవుడ్ డిమాండ్ చేస్తుంది.
150 వరకు ఉన్నాయా ...?
సినీ తారాల చిత్రాలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా అశ్లీలంగా పోస్ట్ లు గుప్పించే వెబ్ సైట్స్ దాదాపు 150 వరకు ఉన్నాయని చిత్రపరిశ్రమ వర్గాలు అంటున్నాయి . అయితే దాదాపు 35 సైట్ల వివరాలతో కూడిన లిస్ట్ లను మాత్రమే ప్రస్తుతం మా అసోసియేషన్ పోలీసులకు అందించింది . దాంతో ముందుగా ఒకరి ని అరెస్ట్ చేసిన పోలీసులు రానున్న రోజుల్లో మరికొందరిని కూడా అదే విధంగా కటకటాలకు చేరుస్తారని ఖాకీ వర్గాలు అంటున్నాయి . ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో ముందు నుంచి ఉద్యమం సాగిస్తున్న సినీ నటి హేమ తన ఆనందం మీడియా తో పంచుకున్నారు. పోలీసులు ఇక నుంచి వీరిపై కఠినంగా వ్యవహరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు .
- Tags
- వెబ్ సైట్లు

