ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసి మరీ...

బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న మౌనిక... ఆత్మహత్యకు ముందు ఇనిస్టాగ్రామ్‌లో తన స్టేటస్‌ను అప్డేట్ చేసింది. సంతోషంగా ఉండాలంటేనే నాకు భయమేస్తోంది రాసుకొచ్చింది. నేను సంతోషంగా ఉంటే ఎందుకో జనం భరించలేకపోతున్నారు... రోజు రోజుకూ నా జీవితం అధ్వాన్నంగా తయారవుతోందని చెప్పింది. ఎలాగో నెట్టుకుంటూ వస్తున్నా... ఈ దరిద్రపు జీవితంలో ప్రతి సంఘటన నుంచి పాఠాలు నేర్చుకుంటున్నానని చెప్పింది. త్వరలోనే దీని నుంచి విముక్తి వస్తుందనుకుంటున్నాను అని ముగించింది. తన జీవితానికి ముగింపు పలికింది... చివరి పోస్టును బట్టే ఆమె ఎంతటి మనో వేదనను అనుభవిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
కుటుంబ కలహాల వల్లనేనా.....?
హైదరాబాద్ సూరారం కాలనీలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న మౌనిక.. ఇంట్లో అందరూ నిద్రపోయాక ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తన జీవితంలో ప్రతి నిమిషం వరెస్ట్‌గా మారిందంటూ చనిపోయేముందు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ అప్లోడ్ చేసుకుంది మౌనిక. మౌనిక ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇరవై ఏళ్లు కూడా నిండలేదు. జీవితాన్ని పూర్తిగా చదవనూ లేదు. చక్కని రూపం...! బంగారు భవిష్యత్తు..! అయినా ఎందుకు బలవంతంగా ప్రాణాలు తీసుకుంది? ఆమె నవ్వితే... ఆనందంగా జీవితాన్ని సాగిస్తుంటే చూడలేకపోయింది ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? మౌనిక విషయంలో ఇలా ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. బీటెక్ చదువుతున్న విద్యార్ధిని ఇలా అర్ధాంతరంగా జీవితాన్ని తుంచేసుకోడానికి కారణం ఏంటి? చలాకీగా ఉండే చిన్నారి ఇలా ఉరి వేసుకుని చనిపోవడం అందరికీ కన్నీళ్లు పెట్టించింది. కేవలం తల్లి మందలించినంత మాత్రాన చనిపోవాలా? కన్నవాళ్లకు ఆమాత్రం మందలించే హక్కు లేదా? అంటే ఇప్పటి పిల్లల మనస్థత్వాలు అంత సున్నితంగా మారిపోయాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు మదిలో కదలాడుతున్నాయి. ఏది ఏమైనా చలాకీగా తిరిగే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం తల్లిదండ్రుల గుండెల్ని పిండేస్తోంది.
- Tags
- మౌనిక ఆత్మహత్య

