ఇద్దరు మిత్రుల కొత్త కథ

ఇద్దరు స్నేహితుల సఖ్యతకు సంకేతంగా ఉన్నారు. కాదు ఉన్నారనుకోవాలి. అందుకనో ఎందుకనో నవ్యాంధ్ర వాకిట అభివృద్ధి ఓ మిథ్య. బాబు సర్కార్ మాటలు అన్నీ అన్నీ అబద్దాలే! కీలక సంస్థల రాక ఆలస్యం అవుతుంటే కనీసం మాట మాత్రంగానైనా అడగలేని దుఃస్థితిలో ఉంటే ఇక ప్రజాప్రతినిధులు ఉండి ఏం లాభం? ఒక్క ఉత్తరంతో నిధులు రప్పించిన ఘనత జయ, మమతది. కానీ వారు ఆ రోజు ఎన్డీఏ పక్షానికి మిత్రులు కారు. కానీ ఇక్కడ బాబు పరిస్థితి వేరు. వారు అడగ్గానే దోస్తీ కట్టారు కానీ ఏం కావాలో నాడూ చెప్పలేదు నేడూ అడగడం లేదు. ఇదీ కొత్త రాష్ట్రంలో కుంటి సాకుల చెబుతూ పాలకులు సాగిస్తున్న సరికొత్త నాటకం.
ఔనన్నా కాదన్నా ఇదే నిజం...
మోడీ మాట బాబు.... బాబు మాట మోడీ ఇలా ఎవరూ ఎవరి మాట ఎవరూ వినిపించుకోరు. ఆర్భాటాల సర్కారుని కేంద్రం పట్టించుకోదు. కొత్త రాష్ట్రానికి నిధులే రావు. ఉన్న నిధులు కాస్తా ఫుల్ పేజ్ యాడ్స్ కోసమే వెచ్చిస్తే, ప్రచారం కోసమే ప్రభుత్వం ఉంటే ఇక మోడీ ఎందుకు సొమ్ములు ఇస్తాడు. ఇవ్వడు గాక ఇవ్వడు. ఇదే విషయమై అనంతపురం నేత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తేల్చేశాడు. పాపం ఆయనకు తత్వం బోధపడినట్టుంది.అందుకే మోడీ ఆడినట్లే ఆడాల్సివస్తోందని, ఈ విషయంలో తాము చేసేది ఏమీ లేదని మథనపడిపోతున్నాడు. ప్రజలంటే ఎంత ప్రేమో మన నాయకులకు.. ఇదే నాయకులు ఆ రోజు విభజన సమయంలో సోనియా భజన చేస్తిరి కదా! అప్పుడు మీరేం చేసినట్లు. కనీసం ఒక్క మాటైనా అడిగారా.. ఏం కావాలో చెప్పారా?? ఏదీ లేదు.
ఆటలో అరటిపండు...
ఇదీ జేసీమాట. ఔను! ఆట ఆడింది ఎవరు ఓడింది ఎవరు గెలిచింది ఎవరు ఓటుకు నోటు కేసు లేకుంటే ఆటే లేదు. కేంద్రం ఇచ్చిన డబ్బులను సొంత డబ్బాలకు ఖర్చు పెట్టకుంటే ఓటమే లేదు. కానీ వేళ కాని వేళ ఈ గోలేంటో! పాపం ఢిల్లీ పెద్దలు బాబుని గెటౌట్ అని అంటున్నారట! నిజమేనా! లేకా ఇది కూడా సానుభూతి రాజకీయంలో భాగమేనా! ఒక్కటి మాత్రం నిజం నిన్నటి ఢిల్లీ లాబీయిస్టలకు ఇప్పుడు కాలం చెల్లింది. సుజనా, సీఎం రమేశ్ ,కంభంపాటి, రాయపాటి ఇలా ఎవ్వరినీ మోడీ దర చేరనీయడం లేదు. ఇక చంద్రబాబు టీం అయిన బీజేపీలో ఉన్న కొందరు కమ్మనేతలను కూడా మోడీ ప్రోత్సహించడం లేదు. కనుక రాష్ట్రానికి నిధులు రావడం లేదు. మన్ కి బాత్ సాక్షిగా నవ్యాంధ్ర వాసులు అర్థం చేసుకోవాల్సింది ఇదే! హోదా రాదు తెల్సు.. పోనీ ప్యాకేజీ ఇవ్వాలి. ఎలా ఇస్తారు.. వెనుకబడిన ప్రాంతంగా ఏపీ ఉందా లేదు కదా! మీరే అంటున్నారుగా రెండెంకెల వృద్ధి నమోదు చేస్తున్నామని.. పోనీ నగరీకరణకు దూరంగా ఉన్న ప్రాంతాలేవైనా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయా లేవు కదా కనుక హోదా వస్తే గిస్తే తెలంగాణకే రావాలి అన్నది ఓ వాదన. నిజమే అక్కడే వెనుకబడిన ప్రాంతాల విస్తీర్ణం ఎక్కువగా ఉంది. కనుక ప్యాకేజీ పేరిట మోడీ సాబ్ ఇచ్చేదేమీ ఉండదు. కనుక బాబు అండ్ కో సైలెంటో సైలెంట్.
ఇంకొంత...
- విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి పట్టణాలను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు కావాలి
- విశాఖ జిల్లాలోని గంగవరం పోర్టు దగ్గర లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ టర్మినల్ (ఎల్ఎన్జీ) ఏర్పాటు చేయాలి
- జాతీయ మత్స్య సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్) ఏర్పాటు చేయాలి.
- ఇలా ఎన్నో ఎన్నెన్నో వేటికీ మార్గం సుగమం కాలేదు.
ఏపీ సర్కార్ వినతులన్నీ పట్టించుకోని కేంద్రం రేపటి వేళ ఓటంటూ ఎలా అభ్యర్థిస్తుందో చూడాలిక. శ్రీకాకుళం జిల్లా, ఉద్దానంలో కొబ్బరి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు కావాలన్నా , పలాసలో జీడీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు దక్కాలన్నా పొందూరు కేంద్రంగా హ్యాండ్ లూమ్ హబ్ ఏర్పడాలన్నా, ఇదే సిక్కోలులో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ (ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్) ఏర్పడాలన్నా..కడపలో అరటి బోర్డు, తిరుపతిలోమామిడి బోర్డు ఏర్పాటు కావాలన్నా కేంద్రం చొరవే కీలకం. కానీ ఇప్పటికిప్పుడు వీటికి క్లియరెన్స్ దొరికే ఛాన్సే లేదు. వీటి విషయమై మన ఎంపీల చొరవ కూడా అంతంత మాత్రమే కావడం శోచనీయం.

