Thu Apr 09 2026 20:12:37 GMT+0530 (India Standard Time)
ఇంత రచ్చవుతుందనుకోలేదన్న చంద్రబాబు

నందిఅవార్డుల ఎంపిక గొడవపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నంది అవార్డుల ఎంపికను జ్యూరీ కమిటీకి అప్పగించామని, అంతా కమిటీయే చూసుకుందని, ప్రభుత్వానికి సంబంధమేంటని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వ్యూహ కమిటీతో చంద్రబాబు భేటీ అయ్యారు. నంది అవార్డులకు కులం రంగు పులమడం ఏంటని ఆయన ఆవేదన చెందారు. ప్రతి దానికీ కులం రంగు పులవడం అలవాటయిపోయిందన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేయించి అవార్డులు ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. జగన్ పాదయాత్ర గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు చంద్రబాబు. జగన్, వైసీపీ వాదనలను కోర్టులే పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు.
- Tags
- చంద్రబాబు
Next Story

