Sun Mar 29 2026 04:14:25 GMT+0530 (India Standard Time)
ఆర్థిక నేరగాళ్లతో కలవాలా?

వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన ఛాలెంజ్ కు టీడీపీ నేతలు సమాధానం చెప్పారు. మంత్రికాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ జగన్ తమ పార్టీ ఎంపీలను కూడా రాజీనామా చేయడంలో కలసి రావాలని కోరుతున్నారని, ఆ ప్రకటన విని తమకు నవ్వాలో? ఏడవాలో తెలియడం లేదన్నారు కాల్వ. జగన్ కు నిన్ననే సీబఐ కోర్టు మరో కేసులో సమన్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ స్వార్థ ప్రయోజనాల కోసమే రాజీనామాల ప్రకటన చేశారని, తమకు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని కాల్వచెప్పారు. అలాగే ఏపీ అభివృద్ధి కోసం పవన్ చేస్తున్న పోరాటానికి స్వాగతిస్తున్నామని చెప్పారు. పవన్ అడిగిన లెక్కలను పంపుతామన్నారు.
- Tags
- జగన్
- మంత్రి కాల్వ
Next Story

