Fri Apr 10 2026 02:05:44 GMT+0530 (India Standard Time)
ఆరు గంటలు సీబీఐ కోర్టులో జగన్

సీబీఐ కోర్టు నుంచి జగన్ బయలుదేరారు. పాదయాత్రకు ఒకరోజు విరామమిచ్చిన జగన్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లి కోర్టులో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ జగన్ ఉన్నారు. తర్వాత ఆయన తిరిగి కర్నూలు జిల్లాకు బయలుదేరి వెళ్లారు. రేపు పాదయాత్ర ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి యధాతధంగా సాగనుంది. కేసు విచారణను ఈ నెల 24వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
Next Story

