ఆరాలు బాగున్నాయి.. పరిష్కారాలే. కరవయ్యాయి...

ప్రధానమంత్రి శంషాబాద్ లో ప్రత్యేక విమానం దిగిన వెంటనే సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడెమికి బయల్దేరి వెళ్ళాలి. కానీ అయన శంషాబాద్ విమనాశ్రయంలోనే సుమారు 20 నిముషాలు ఆగారు. ఆ సమయంలో కొద్దిసేపు సిఎం కెసిఆర్, గవర్నర్ నరసింహన్ లను పక్కకు తీసుకువెళ్ళి ముచ్చటించారు. ప్రజలకు నోట్లు సరిగా అందుతున్నాయా.. రాష్ట్రానికి సరిపడా వస్తున్నాయా అంటూ ప్రధాని అరా తీసినట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. శోచనీయమయిన విషయం ఏమిటంటే ప్రధాని ఆరాలు తీయడం తియ్యగా కనిపిస్తున్నదే తప్ప ఫలితం అందడం లేదు.
ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను మాత్రం సిఎం కెసిఆర్ ఎలాంటి సశబిషలు లేకుండా ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. నోట్లు సరిపడా అందడం లేదని ప్రజలు బ్యాంకు ల వద్ద ఇంకా ఇబ్బందులు పడుతున్నారని కెసిఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రధాని దీనికి పరిష్కారంగా ఏమి చేయగలరని స్పష్టత మాత్రం లేదు.

