Tue Mar 24 2026 18:18:50 GMT+0530 (India Standard Time)
ఆయనే ఆమరణ దీక్షకు దిగుతారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వామపక్ష నేతలతో విజయవాడలో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై ఆయన లెఫ్ట్ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. పవన్ కల్యాణ్ ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీలో ఆమరణ దీక్షకు దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ ఆమరణ దీక్షపై నిర్ణయం తీసుకుంటారా? అన్న చర్చ జరుగుతుంది. అలాగే వెనుకబడిన ప్రాంతాలైన ప్రకాశం, అనంతపురం, ఉత్తరాంధ్ర సమస్యలపై కూడా పవన్ వామపక్ష నేతలతో చర్చిస్తున్నారు. మరి ఆమరణ దీక్షపై పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి ఆ పార్టీ అభిమానుల్లో నెలకొని ఉంది.
Next Story

