Thu Mar 26 2026 00:50:54 GMT+0530 (India Standard Time)
ఆయన రాజీనామాచేస్తే నేనూ చేస్తా

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో పాటు అందరూ రాజీనామాలు చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఆయన అమరావతిలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వల్లనే తనకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, బీజేపీ మద్దతుతోనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికలప్పుడు 1500 హామీలిచ్చిన చంద్రబాబు ఏఒక్కటీ అమలుపర్చలేదని, సీఎంగా చంద్రబాబు విఫలమయ్యారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. బీజేపీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అందరినీ మోసం చేశారని, ఆయన అవినీతిని ప్రజల్లోకి తీసుకెళతామని చెప్పారు.
- Tags
- సోమువీర్రాజు
Next Story

