Wed Mar 25 2026 03:09:39 GMT+0530 (India Standard Time)
ఆ నేత వైసీపీలో చేరకుండా ఉండేందుకు?

వైసీపీలో చేరతాడని ప్రచారం జరుగుతున్న బెజవాడ టీడీపీ నేత యలమంచలి రవి ముఖ్యమంత్రి చంద్రబాబును కొద్దిసేపటి క్రితం కలిశారు. ఆయన ఈనెల రెండో వారంలో జగన్ సమక్షంలో వైసీపీలో చేేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీని వీడకుండా ఉండేందుకు ఆ పార్టీ నేతలు యలమంచలిని బుజ్జగిస్తున్నారు. ఈ మేరకు విజయవాడ ఎంపీ కేశినేని నాని యలమంచలి రవిని తీసుకుని చంద్రబాబు వద్దకు వెళ్లారు. యలమంచలి రవి మనసుమార్చుకుంటారా? లేక వైసీపీలో చేరతారా? అన్నది తేలాల్సి ఉంది.
Next Story

