Wed Mar 25 2026 23:07:19 GMT+0530 (India Standard Time)
ఆ నలభై మంది మాతో టచ్ లో ఉన్నారు

జనసేన అధినేత ఎక్కడా తగ్గడం లేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని జనసేన పార్టీ నాయకులు అద్దేపల్లి శ్రీధర్, మహేందర్ రెడ్డి, రియాజ్ లు మీడియాకు తెలిపారు. ఆ నలభై మంది ఎవరనే విషయం చంద్రబాబుకూ తెలుసునన్నారు. ఆ నలభై మంది ఎమ్మెల్యేల పేర్లను తాము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాకుండా లోకేష్ అవినీతిని ఎండగడతామని చెప్పారు. లోకేష్ అవినీతిపై ఢిల్లీ స్థాయి ఏజెన్సీతో విచారణ జరిపించాలని తాము కోరతామని చెప్పారు. త్వరలోనే ఏపీ మంత్రులకు సంబంధించిన అవినీతి బండారాన్ని బయటపెడతామని హెచ్చరించారు. తమ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పారదర్శకంగా ఉన్నారని, అన్ని ఆధారాలతోనే లోకేష్ పై ఆరోపణలు చేశారన్నారు.
- Tags
- జనసేన
Next Story

