ఆ 9 మంది ఎమ్యెల్యేలకు గండం పొంచి ఉందా ..?

ఆప్ ఎమ్యెల్యేలపై ఈసీ వేటు వేసాకా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి పదవుల్లో వున్నవారికి భయం పట్టుకుంది. లాభదాయక పదవులను గతంలో అనుభవించి హై కోర్డు రద్దు చేయడంతో పార్లమెంటరీ సెక్రెటరీలుగా పదవులు వదులుకున్న తెలంగాణ ఎమ్యెల్యేల్లో నానాటికి ఈ ఆందోళన పెరుగుతుంది. వారి ఆందోళనకు అసలు కారణం రేవంత్ రెడ్డి. ఆయన ఈసీ ఢిల్లీ లో ఇచ్చిన తీర్పే తెలంగాణ లో వర్తింప చేయాలని తాజాగా మారోసారి పోరాటం ఉధృతం చేశారు. తెలంగాణాలో గతంలో ఈ పదవులు ఉల్లఘించి కోర్టు వల్ల రద్దు అయినా, వారిపై అనర్హత వేటు పడాలనే రేవంత్ కోరుతున్నారు. అందుకోసం కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ కలిసి ఫిర్యాదు చేశారు. అసలే టి సర్కార్ అనుకులుడిగా వున్నారని విమర్శలు ఇటీవల బాగా ఎదుర్కొన్న నరసింహన్ ఈ ఫిర్యాదు ఈసీకి పంపించేందుకు సిద్ధం అయ్యారు. మరోవైపు రేవంత్ మరోసారి ఈసీకి, ఢిల్లీ హై కోర్ట్ కి కూడా తన ఫిర్యాదు పంపించారు. మోడీ సర్కార్ ఆప్ పై కక్ష కట్టి ఈ చర్యలకు దిగింది అన్న విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నవారిపై వేటు వేయకపోతే అభాసుపాలు అయ్యేలా వుంది కేంద్ర ఎన్నికల సంఘం.
టెన్షన్ లో వున్న 9 మంది వీరే ...
తెలంగాణాలో పార్లమెంటరీ సెక్రటరీ లుగా పనిచేసి కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయడంతో పదవులు నుంచి వైదొలగిన వారిలో మహబూబ్ నగర్ ఎమ్యెల్యే శ్రీనివాస గౌడ్ ,కొత్తగూడెం ఎమ్యెల్యే జలగం వెంకట రావు, వరంగల్ పశ్చిమ ఎమ్యెల్యే వినయ్ భాస్కర్, హుస్నాబాద్ ఎమ్యెల్యే సతీష్ కుమార్,తుంగతుర్తి ఎమ్యెల్యే గాదరి కిషోర్ కుమార్, ఆసిఫాబాద్ ఎమ్యెల్యే కోవా లక్ష్మి వున్నారు. వీరంతా గతంలో కోర్టు తీర్పు కారణంగా ఆయా పదవులనుంచి వైదొలగమని ఇప్పుడు తమపై చర్యలు ఉండవన్న ధీమా పైకి వ్యక్తం చేస్తున్నా లోలోపల ఆందోళన చెందుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక వీరు ఆరుగురు కాక ఇంకా లాభదాయక పదవుల్లో వున్న వారిలో ప్రశాంత్ రెడ్డి, సోమారపు సత్యనారాయణ, రసమయి బాలకిషన్ వున్నారని లెక్కేశారు రేవంత్. సో వీరందరికి ఆప్ ఎమ్యెల్యేఏలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అలాగే యాక్షన్ ఉండాలన్న రేవంత్ పోరాటాన్ని ఈసీ పరిగణలోనికి తీసుకుంటుందో లేదో చూడాలి.

