ఆ 20 మంది పరిస్థితి ఏంటి?

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. పార్లమెంటరీ కార్యదర్శులుగా లాభదాయక పదవులు పొందరాని ఆప్ ఎమ్మెల్యేలు 20 మందిపై ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈసీ సిఫార్సుకు వెంటనే రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈసీ సిఫార్సును ఆమోదించారు. దీంతో 20 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. దీనిపై అనేక విమర్ళలు వచ్చాయి. రాజీకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమపై వేటు వేశారని ఆప్ సయితం ఎదురుదాడికి దిగింది.
29వ తేదీ వరకూ అంతేనా?
అయితే దీనిపై 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో వారికి ఊరట దక్కలేదు. తమపై అనర్హత వేటును వేయడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటీషన్ ను హైకోర్టు స్వీకరించింది. తమపై అనర్హత వేటును నిలిపేయాలని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును ఆప్ ఎమ్మెల్యేల తరుపున న్యాయవాది కోరారు. అయితే హైకోర్డు మాత్రం అందుకు నిరాకరించింది. అనర్హత వేటును నిలిపేయడానికి అంగీకరించకుండా ఈ కేసును ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. దీంతో మరో ఐదు రాజుల పాటు వీరి అనర్హత వేటుపై అనిశ్చితి నెలకొంది. అయితే అనర్హత వేటు పడిన 20 మంది ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలకు ఏర్పాట్లను ఈ నెల 29వ తేదీ వరకూ చేయరాదని మాత్రం ఆదేశించింది. ఈ నెల 29న ఈ 20 మంది ఎమ్మెల్యేల భవిష్యత్ తేలనుంది.
- Tags
- ఆమ్ ఆద్మీ

