అసెంబ్లీలో బాలయ్య బాబును ఏంచేశారంటే ...!

బాలయ్య బాబు సాక్షాత్తు ఎన్టీఆర్ వారసుడు ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది, వియ్యకుండు కాబోయే టిడిపి అధినేత లోకేష్ కి మావగారు కూడా. ఇన్ని ఉన్నాకా ఆయనకు లెజెండ్ చిత్రంలో నంది అవార్డు వచ్చాక అధికారపార్టీ ఊరుకుంటుందా ? సాక్షాత్తు అసెంబ్లీలోనే హిందూపురం ఎమ్యెల్యేకు అభినందనలపర్వం మొదలు పెట్టారు. బాలయ్య బాబుకి శుభాకాంక్షలు అంటూ పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్ ముందుగా అభినందనలకు తెరతీశారు. మరీ బాగోదని జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబులకు కూడా అంటూ ముక్తాయింపు ఇచ్చారు.
పితాని సైతం ....
తమ జిల్లా ఎమ్యెల్యేనే అలా పొగిడితే తానేమి తక్కువ తినలేదని పగో జిల్లాకు ప్రాతినిధ్యం వహించే పితాని సత్యనారాయణ లేచారు. అసలు ఆ అవార్డు మాకే వచ్చినంత గర్వంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇలా ఒకరితరువాత మరొకరు పొగుడుతుంటే బాలయ్యకు ఎలా ఉంటుంది. ఆయన వీరి వెనుక బెంచ్ ల్లో కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ ఆస్వాదించారు. విపక్షం లేకపోవడంతో అధికారపక్షం సభ నడుపుకుంటున్న నేపథ్యంలో వారికి కావలిసిన అంశాలపై హాయిగా ప్రభుత్వం మాట్లాడుతూ సభా పర్వాన్ని కానిస్తుంది.
- Tags
- బాలకృష్ణ

