అసలు రాహుల్ హిందువా ... కాదా ...?

కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ పై కొత్త వివాదం మొదలైంది. గుజరాత్ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ఆలయాల బాట పట్టి దేవుడికో నమస్కారం పెట్టి పూజలు చేస్తున్నారు యువరాజు. అంతవరకు బాగానే వున్నా గుజరాత్ లోని సుప్రసిద్ధ సోమనాధ దేవాలయాన్ని రాహుల్ తాజాగా సందర్శించారు. ఈ ఆలయం సందర్శించే హిందువులు కాని వారికోసం ఒక రిజిస్టర్ ఉంటుంది. అందులో అలా వచ్చిన వారు పేరు నమోదు చేసుకుంటారు. రాహుల్ గాంధీ నాన్ హిందువు రిజిస్టర్ లో సంతకం చేయడాన్ని బిజెపి ఇప్పుడు వివాదంగా మార్చింది.
రాహుల్ ఇప్పుడు ఎలా కాదంటున్నారు....?
గుజరాత్ ఎన్నికల్లో వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని అధికార బిజెపి, విపక్ష కాంగ్రెస్ పార్టీలు వదిలిపెట్టడం లేదు. రాహుల్ తాజా వివాదాన్ని బిజెపి మరింతగా జనంలోకి తీసుకువెళ్ళే పనిలో పడింది. గతంలో తాను హిందూ బ్రాహ్మణ అని చెప్పిన రాహుల్ ఇప్పడు ఆకస్మికంగా తాను హిందువు కాదని రాతపూర్వకంగా పేర్కొనడాన్ని తప్పు పడుతూ తీవ్ర విమర్శలు చేసింది బిజెపి. తాను అసలు ఏంటో రాహుల్ స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. ఇంకా వెనక్కి వెళ్లి గతంలో సోమనాధ ఆలయాన్ని భారత తొలి ప్రధాని జవహర్ లాల్ వ్యతిరేకించారని కానీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకుని ఆలయ అభివృద్హికి కృషి చేశారని చెప్పుకొచ్చారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు రాహుల్ నాలుగు ఓట్లు వస్తాయని సెంటిమెంట్ తో లాగుదామనే చేసిన ఈ ప్రయత్నం ఆదిలోనే బెడిసి కొట్టింది.
- Tags
- రాహుల్

