Sun Apr 12 2026 01:49:30 GMT+0530 (India Standard Time)
అవినీతి కేసులో టి.కాంగ్రెస్ నేత?

అవినీతి కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలి చిక్కుకుకున్నారు. హవాలా వ్యవహారంలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వేసిన ఛార్జిషీటులో షబ్బీర్ అలి పేరును నమోదు చేసింది. కాన్పూరు కుచెందిన మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీతో షబ్బీర్ అలికి సంబంధాలున్నట్లు ఈడీ గుర్తించింది. షబ్బీర్ అలీ సీబీఐ చీఫ్ కోసం 1.75 కోట్లు లంచం ఇవ్వచూపారని కేసు నమోదుచేసింది. అయితే దీనిపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలి స్పందించారు. తనకు ఏమాత్రం సంబంధంలేదని, నోటీసులు అందిన తర్వాతనే స్పందిస్తామని చెప్పారు. సుఖేష్ గుప్తాకు బెయిల్ ఇవ్వడం కోసం ఈ లంచం ఇవ్వడానికి ప్రయత్నించారన్నది ప్రధాన ఆరోపణ. దీంతో టీ కాంగ్రెస్ షాక్ గురయింది.
Next Story

