Sat Apr 04 2026 17:33:20 GMT+0530 (India Standard Time)
‘అవసరమైతే రద్దు చేస్తాం’

అమరావతికి సమీపంలో జనసేన పార్టీ కార్యాలయంపై వస్తున్న వివాదాలపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. తాము రైతు దగ్గర మూడున్నరేళ్లకు స్థలాన్ని లీజుకు తీసుకున్నామన్నారు. జనసేన కార్యాలయం కోసం తీసుకున్న స్థలంపై వివాదం ఉంటే ఆ స్థలాన్ని తీసుకోబోమన్నారు. తాను ఇటీవల స్థలం వద్దకు వచ్చినప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదన్నారు. స్థలం వివాదాస్పదమైతే లీజును రద్దుచేసుకుంటామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. స్థలం లీజుకు తీసుకున్న విషయాన్ని పత్రికా ప్రకటన ఇచ్చామన్నారు. అయితే ఈ స్థల యజమాని యార్లగడ్డ సుబ్బారావు మాత్రం తన తండ్రి 1956లో ఒక ముస్లిం కుటుంబం నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారని, ఇంతవరకూ ఆ స్థలం తమదేనని ఎవరూ రాలేదన్నారు.
- Tags
- పవన్ కల్యాణ్
Next Story

