అర్థరాత్రి అడవిలో బాలిక... ఏం జరిగింది?

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 సంవత్సరాల బాలిక తండ్రి చనిపోయాడు. తల్లి కూలి పని చేస్తూ మర్పల్లి మండల కేంద్రంలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివిస్తుంది. అదే సమయంలో అమ్మాయి బావ సురేష్ అమ్మాయిని తల్లిని భయపెట్టి కర్ణాటక లోని చించొల్లి కి చెందిన తుకారాం అనే నలభై సంవత్సరాల వ్యక్తితో ఈ నెల పదకొండు న వివాహం జరిపించాడు. తుకారాం కు అంతకుముందే పెళ్లయి ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలికకు పెళ్లి ఇష్టం లేకపోవడంతో కర్ణాటకలోని చించోలి లో అమ్మాయిని నిర్భంధించారు. అక్కడ మూడు రోజులు నిర్బంధంలో ఉన్న బాలిక ఈ నెల 14 న ఒక ఫోను, యాభై రూపాయలు తీసుకుని ఇంట్లో నుంచి తప్పించుకుంది. చించొల్లి నుండి బస్సులో కల్లూరు వచ్చిన బస్సు నైట్ హాల్ట్ అక్కడే ఉండటంతో అక్కడే అపేశారు.. తాండూరు వరకు వస్తుందనుకున్న బస్సు అక్కడే అగడంతో గ్రామంలో ఉంటే మళ్లీ తమ బందువులు వచ్చి తీసుకు వెళతారని గ్రామం నుండి దూరంగా వచ్చి అడవిలో ఓ పొదలో తలదాచుకున్నానని బాలిక రోదిస్తూ చెప్పింది. రాత్రి సమయంలో 1098 సిబ్బంది ఫోన్ చేస్తే వస్తారో రారో అన్న అనుమానంతో రాత్రంతా చలిలో ఒంటరిగా నరకం అనుభవిస్తూ అక్కడే తలదాచుకుని ఉదయం 6:10 నిమిషాలకు 1098 కు పోన్ చేయగా తాను ఉన్న స్థలానికి వచ్చారని అమ్మాయి చెప్పింది. 1098 సిబ్బంది కరణ్ కోట్ పోలీసుల సహాయంతో వికారాబాద్ డీఎస్పీకి బాలికను అప్పగించారు. డీఎస్పీ శిరీష మాట్లాడుతూ అమ్మాయి మైనర్ ఐనప్పటికి ధైర్యంతో వారి బంధువుల నుండి తప్పించుకుని సురక్షితంగా వచ్చిందన్నారు. బాలిక విషయంలో 1098 సిబ్బంది పనితీరు చాలా బాగుందన్నారు. బాలికను భయపెట్టి పెళ్లి చేసిన వ్యక్తులు పరారీలో ఉన్నారని వారిని పట్టుకుని శిక్ష పడేలా చేస్తామని అన్నారు.
- Tags
- అడవిలో బాలిక

