అరుదైన రికార్డ్ అతిలోకసుందరికే

భారతీయ చిత్రసీమలోనే కాదు ప్రపంచ చిత్రసీమలోనే ఏ హీరోయిన్ నెలకొల్పలేని అరుదైన రికార్డ్ శ్రీదేవికే సొంతం. కుమార్తెగా నటించిన హీరోల చెంతనే హీరోయిన్ గా నటించే అవకాశం ఒక్క శ్రీదేవి మాత్రమే ఇప్పటివరకు నెలకొల్పడం. ముఖ్యంగా తెలుగులో ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్, శోభన్ బాబు, కృష్ణ వీరి చిత్రాల్లో కుమార్తె గా నటించారు శ్రీదేవి. అదే ప్రముఖ హీరోల సరసన ఆమె హీరోయిన్ గా నటించి విభిన్నమైన అరుదైన చెక్కు చెదరని రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ బడిపంతులు చిత్రంలో కుమార్తెగా, వేటగాడి చిత్రంలో హీరోయిన్ గా నటించారు ఆమె. సూపర్ స్టార్ కృష్ణ తో మా నాన్న నిర్దోషి లో కుమార్తెగా బుర్రిపాలెం బుల్లోడు లో హీరోయిన్ గా నటించారు శ్రీదేవి. ఇక అక్కినేని తోను శ్రీదేవి ముద్దుల కొడుకు తో మొదలు పెట్టి ప్రేమాభిషేకం తో బ్లాక్ బ్లాస్టర్ సాధించారు. శోభన్ బాబు తో నటించిన కార్తీక దీపం అదే స్థాయిలో హిట్ అయ్యింది.
అగ్ర హీరోల కొడుకులతో ...
తెలుగులో అత్యంత అరుదైన రికార్డ్ లు శ్రీదేవి నెలకొల్పింది. ఏఎన్ ఆర్ తో కుమార్తె గా హీరోయిన్ గా నటించిన శ్రీదేవి నాగార్జునకు హీరోయిన్ గా నటించి తనకు తానే సాటిగా నిలిచింది. మూడు దశాబ్దాల కాలంలో అగ్రహీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లతో నటించిన శ్రీదేవి బాలకృష్ణ తో మాత్రం నటించని లోటు మిగిల్చారు. రెండుతరాలకు వారధిగా ఉండటమే కాదు తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి మూడోతరం అయిన తమ కుమార్తెలతో నటించాలని భావించినా దురదృష్టం శ్రీదేవిని తీసుకువెళ్లిపోయింది.

