అమ్మమ ఊర్లో రోహిత్ ఏం చేయబోతున్నాడు ...?

విశాఖ ను క్రికెట్ ఫీవర్ పట్టి కుదిపేస్తోంది. మూడు వన్డేల సిరీస్ లో చిట్ట చివరి మ్యాచ్ కి విశాఖ వేదికైంది. శ్రీలంక, భారత్ చెరో మ్యాచ్ గెలవడంతో మూడవ వన్డే విజేత ఎవరౌతారనే అంశం ఆసక్తికరం చేసింది. ధర్మశాల వన్డేలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీం ఇండియా మొహాలీ లో తిరుగులేని విజయాన్ని ప్రత్యర్థిపై నమోదు చేసింది. రెండో మ్యాచ్ లో రోహిత్ చేసిన డబుల్ సెంచరీ ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో మార్మోగిమోయింది. దాంతో వైజాగ్ వన్డే లో రోహిత్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
వైజాగ్ లో టీం ఇండియా ట్రాక్ బావుంది....
బ్యాటింగ్ వికెట్ అయిన వైజాగ్ లో ఇప్పటివరకు భారత్ ట్రాక్ సూపర్ గా వుంది. టీం ఇండియా ఆడిన ఏడు వన్డే ల్లో ఐదింట గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా విండీస్ పై ఓటమి నమోదు చేసుకుంది. విశాఖలో న్యూజిలాండ్ తో చిట్ట చివరిగా జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది. వైజాగ్ పిచ్ రోహిత్, ధోని లకు బాగా అచ్చి వచ్చిందే. వీరిద్దరూ భారీ స్కోర్లే ఇక్కడ నమోదు చేశారు గతంలో. ఆదివారం జరిగే త్రి సిరీస్ ఫైనల్ మ్యాచ్ కి రెండు జట్లు విశాఖ చేరుకొని చాలా తీవ్ర స్థాయిలో సాధన మొదలు పెట్టాయి. ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ అమ్మమ వూరు విశాఖపట్నం కావడంతో ఈ లోకల్ బాయ్ తాజా మ్యాచ్ లో చెలరేగాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మొహాలీ మ్యాచ్ లో డబుల్ ధమాకా మోగించి తన భార్యకు కానుక ఇచ్చిన రోహిత్ అమ్మమ ఊరికి సిరీస్ విజయాన్ని అందించాలని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
- Tags
- రోహిత్ శర్మ

