Mon Dec 29 2025 23:50:17 GMT+0000 (Coordinated Universal Time)
అమ్మ కోలుకుంటున్నదని సంతోషిస్తున్నారు కానీ,

గత 13 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు. ఇప్పటికే అభిమానులు, కార్యకర్తలు విపరీత ఆందోళనకు గురవుతూ గుళ్ళలో పూజలు, దీక్షలు చేసేస్తున్నారు. కొంతమందైతే జయలలితపై ఎక్కడి లేని పుకార్లు పుట్టించేసి మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. అసలు జయకేమైంది?. ఆమె ను ఎందుకు ఇన్ని రోజులుగా ఆసుపత్రిలో ఉంచారు? ఎందుకు జయ ఆరోగ్యం పై ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇవ్వడం లేదు? అని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు పుకార్లు పుట్టించేస్తున్నారు. కొంతమందిపై పోలీస్ లు కేసులు కూడా పెట్టారు. ఎంత మంది మీద ఇలా కేసులు పెడతారు.
అయితే కార్యకర్తలకి, అభిమానులకి ఒక ఒక శుభవార్త జయలలిత హాస్పిటల్ లో కళ్ళు తెరిచింది డాక్టర్స్ ఒక హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆమె కొంచెం కొంచెం కోలుకుంటున్నారని..... ఇప్పుడే కళ్ళు తెరిచారని 12 గంటల ప్రాంతం లో తెలియజేసారు. ఇక అభిమానులు, కార్యకర్తల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఎంత సంతోష పడుతున్నాకూడా మరో పక్క ఆందోళనగానే వున్నారు. ఎందుకంటే జయలలిత అందరి ముందు తిరిగినప్పుడే వాళ్లకు పూర్తి సంతోషం లభించినట్లని వారంటున్నారు. అయితే కళ్ళు తెరిచినా కూడా జయ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు.
అక్కడ హాస్పిటల్ లో ఇంత జరుగుతున్న ప్రస్తుతం జయలలిత అధికారాలన్నీ, పనులను చక్కబెడుతున్న పన్నీర్ సెల్వం మరో ఇద్దరు మంత్రులతో హుటాహుటిన హాస్పిటల్ కి చేరుకొని హడావిడిగా లోపలికెళ్ళిపోయారు. అయితే పన్నీరు సెల్వం ఇప్పటికే జయ మాజీ ఫ్రెండ్ శశికళని కలిసినట్లు వార్తలొస్తున్నాయి. ఆమె ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటూ.... ముఖ్యనేతలని సమావేశ పరిచే పనిలో పడింది. మరి ఈ తతంగం అంతా చూస్తూ అభిమానులకి మళ్ళీ ఆందోళన మొదలైంది. అయితే అపోలో హాస్పిటల్ లో ప్రస్తుతం జయలలిత చికిత్స పొందుతున్న వార్డులోకి శశికళ మినహా మరెవరికీ ప్రవేశం కల్పించడంలేదు.
Next Story

