అమరావతిలో మాఫియా అప్పుడే బయలుదేరిందా?

తినే పదార్ధాలు కల్తీ, తాగే నీళ్లు కల్తీ, పీల్చే గాలి కల్తీ ఇవన్నీ భరించిన పాపానికి రోగం వచ్చి ఆసుపత్రి పాలైతే అక్కడ లభించే మందులు కల్తీవే. దాంతో డైరెక్ట్ బోర్డింగ్ పాస్ మనం కోరుకున్నా కోరుకోకపోయినా లభించే ప్రమాదకర పరిస్థితి ఇప్పుడు నెలకొంది. రోగులకు ప్రాణాధారమైన ఈ నకిలీ మందుల తయారీ గుట్టును పోలీసులు ఛేదించారు. ఈ నకిలీ మందులు నడుపుతున్న మాఫియాలోని 8 మందిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపారు.
అమరావతి కేంద్రంగా .....
అమరావతి రాజధాని గా ప్రకటించారో లేదో మాఫియా లన్ని ప్రభుత్వం కన్నా ముందు రాజధాని ప్రాంతాన్ని తమ అక్రమాలకు అడ్డాగా మార్చేశాయి. కాఫీ, టీ పొడి, పప్పులు ఉప్పులూ, షాంపూలు, నెయ్యి ఇలా అన్ని వస్తువుల నకిలీ ఐటమ్స్ కి కేరాఫ్ అడ్రెస్ బెజవాడ అయిపొయింది. తాజాగా దొరికిన నకిలీ మందుల తయారీ బృందం అమరావతిని తమ అడ్డా చేసుకోవడం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. ఇక్కడి నుంచే ఏపీలోని అన్ని జిల్లాలకు మాఫియా విస్తరించినట్లు నేరుగా వైద్య శాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. విజయవాడ నుంచి కర్నూల్ నంద్యాల, హైదరాబాద్, ఛత్తీస్ ఘడ్ , ఉత్తరాంచల్ వరకు నకిలీ దందా సాగుతున్నట్లు విచారణలో తేలడంతో వివిధ రకాల రోగాలకు మందులు వినియోగించే రోగులు వాటిని రాసే వైద్యులు ఒకటికి పది సార్లు పరిశీలించి జాగర్తలు తీసుకోవాలి. లేనిపక్షంలో వేసుకునే మాత్ర వైకుంఠ యాత్ర కు తీసుకుపోతుంది మరి.
- Tags
- అమరావతి

