అమరావతి బొమ్మలు జనం మీదకు వదిలారే?

అదిగో నవలోకం అంటూ అమరావతి కొత్త డిజైన్లను సోషల్ మీడియా లో ఏపీ సీఆర్డీఏ అధికారులు విడిచి పెట్టారు. దీని వెనుక పెద్ద నాటకమే ఉందని విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. డిజైన్లు ఖరారు అయిపోయాయని ఈనెల చివరి వారంలో లండన్ లో పర్యటించే చంద్రబాబు ఒకే చేయడం ఖాయం అని అమరావతి లో ముందే ప్రచారం సాగుతుంది. అయితే ప్రజలు ఆమోదించిన వాటినే ఖరారు చేశారనే కలర్ ఇచ్చేందుకు పార్టీ మిడియా పత్రికలు వున్నా సీఆర్డీఏ ద్వారా సోషల్ మీడియా లో విడిచి పెట్టారని అంటున్నారు. ఈ వారం రోజులు ప్రజల నుంచి పెద్దఎత్తున డిజైన్లకు ఆమోదం లభించిందని ప్రచారం అధికార పార్టీ మీడియా కోడై కూసేలా చేసి లండన్ లో బాబు ఒకే చెప్పేస్తారని అంటున్నారు విశ్లేషకులు.
అప్పుడే 90 శాతం ఆమోదించేశారని మొదలైన ప్రచారం ...
ఫోటోలు సోషల్ మీడియా లో ఇలా పోస్ట్ అయ్యాయో లేదో అధికారపార్టీ అనుకూల ఛానెల్స్ ప్రజలు 90 శాతం కొత్త అమరావతి డిజైన్లను ఆహా ఓహో అంటున్నారంటూ ప్రచారం ఉదరగొట్టేస్తున్నాయి. సర్వజన ఆమోదంతోనే ఇదంతా చేస్తున్నామన్న ప్రచారం పెద్దఎత్తునే మొదలైపోయింది. లండన్ పర్యటనకు చంద్రబాబు వెళ్లడమే తరువాయి అన్నట్లు వుంది వ్యవహారం అని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. తాజాగా నార్మన్ పోస్టర్ బృందంతో రూపొందించిన డిజైన్లు దర్శకుడు రాజమౌళి సూచనలకు అనుగుణంగా జరిగాయనేది కూడా బాగా ప్రచారం చేస్తున్నారు. రాజమౌళి వంటి ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు డిసైడ్ చేసిన కళాకృతులు అన్న సీన్ ఎలానూ ఉండనే ఉంటుంది కనుక ఇప్పుడు వీటికి మమ అనడమే... తరువాయి. వాస్తవానికి పాత డిజైన్లకు ఇప్పుడు విడుదల చేసిన డిజైన్లకు పెద్దగా మార్పులు లేవన్నది పలువురి అభిప్రాయం . మొత్తానికి బాబు తాను అనుకున్నది పక్కాగా చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు.
- Tags
- అమరావతి

