అప్పులోడి విలాసవంత క్యాలెండర్ వచ్చేసింది ...!

కింగ్ ఫిషర్. ఈ పేరు చెప్పగానే అంతా విజయ మాల్యా అని ఇట్టే చెప్పేస్తారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కింగ్ ఫిషర్ క్యాలెండర్ మార్కెట్లోకి విడుదల చేశాడు మాల్యా. క్రొయేషియా లో బ్రిస్ని లో అద్భుత లొకేషన్స్ తో ఈ క్యాలెండర్ ఫోటో షూట్ పూర్తి చేసుకుంది. 9 వేలకోట్ల రూపాయల రుణాలను ఇండియా లో ఎగ్గొట్టి లండన్ పారిపోయిన మాల్యా విదేశాల్లో వున్నా తన విలాసవంతమైన జీవితానికి ఎక్కడా బ్రేక్ వేయడం లేదు అనడానికి తాజా క్యాలెండర్ నిదర్శనం. అద్భుతమైన అందగత్తెలతో ఈ క్యాలెండర్ తాగకుండా మత్తెక్కిస్తోంది.
కింగ్ ఫిషర్ కి క్రేజే వేరు ....
కింగ్ ఫిషర్ క్యాలెండర్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు క్రేజు వున్నాయి. గతంలో దీపికా పదుకొనె, కత్రినా కైఫ్ వంటి వారు కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో బికినీ షూట్ లతో ఒక ఊపు ఊపినవారే. తాజాగా నయా క్యాలెండర్ ను సైతం అందమైన భామలతో కేక పెట్టించే విధంగా తయారు చేశాడు విజయ మాల్యా. మాల్యా కింగ్ ఫిషర్ క్యాలెండర్ లకు దేశ విదేశాల్లో మంచి పేరు వుంది. ఈసారి ప్రముఖ మోడల్స్ తో బికినీ షూట్ చేయించారు ఈ క్యాలెండర్ కూడా హాట్ హాట్ గా ఉండటంతో మరోసారి మాల్యా క్యాలెండర్ క్రేజ్ ఖండాతరాలు దాటిపోనుంది. అయితే బ్యాంక్ ల సొమ్ము ఎగొట్టి ఇలా కింగ్ ఫిషర్ అధినేత చేస్తున్న ఆర్భాటపు ప్రచారంపై మాత్రం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- Tags
- విజయ్ మాల్యా

