అన్నీ చేశాం...ఇంకా చేస్తాం...!

విభజనచట్టం హామీల అమలుకు మోడీ కట్టుబడి ఉన్నారని ఏపీ బీజేపీ నేతలు స్పష్టం చేశారు. రెవెన్యూ లోటు భర్తీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం శత విధాలుగా ప్రయత్నిస్తుందని, రాజకీయ లబ్ది కోసం బీజేపీపై బురద చల్లడం సరికాదన్నారు. పోలవరానికి ఇప్పటికే నాలుగు కోట్ల రూపాయలను నిధులన విడుదల చేశామన్నారు. నితిన్ గడ్కరీ దగ్గరుండి ప్రాజెక్టు పనులు పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. విభజన చట్టంలో ఉన్న హామీలకు కేంద్ర పరభుత్వం కట్టుబడి ఉందన్నారు. దుగరాజు పట్నం పోర్టుపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయన్నారు. ఏపీకి కేంద్రం చేసిన సాయాన్ని బీజేపీయే సవరించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ కింద అధిక నిధులు ఇస్తుందన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 90 శాతం గ్రాంటు కింద కేంద్రం నిధులు అందజేస్తుందనిచెప్పారు. ఇప్పటికే కొన్ని కేంద్ర సంస్థలు ఏపీలో ప్రారంభమయ్యాయయన్నారు. దుగరాజు పట్నం ఓడరేవు, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వేజోన్, కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు పార్లమెంటులో చట్టం తీసుకురావాల్సి ఉందన్నారు. రైల్వే జోన్ విషయంలో ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. పదినెలల రెవెన్యూ లోటును కేంద్రం త్వరలోనే భర్తీ చేస్తుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి అందనంత సాయం కేంద్రం ఏపీకి చేసిందని చెప్పారు. మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, నరసింహరావులు పాల్గొన్నారు.
- Tags
- బీజేపీ

