Mon Mar 30 2026 17:59:45 GMT+0530 (India Standard Time)
అనూషను ఎందుకు చంపాడు?

హయత్ నగర్ లో అనూష అనే యువతి దారుణ హత్యకు గురైంది. బండ రాయితో తల పై బలంగా మోది హతమార్చారు దుండగులు. బీటెక్ పూర్తి చేసిన అనూష దేవరకొండ నుండి హయత్ నగర్ కు పోలీసు శాఖలో కోసం కోచింగ్ తీసుకోవడానికి వచ్చి ఒంటరిగా ఉంటోంది. మోతిలాల్ అనే వ్యక్తి పై అనుమానాలు వ్యక్తం చేశారు బంధువులు. అనూషకు, మోతీలాల్ కు నెలక్రితం నిశ్చితార్థం అయింది. అయితే కొన్ని విభేదాలతో నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో అనూషను మోతీలాల్ వేధించేవాడని బంధువులు చెప్పారు. మోతీలాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మోతీలాల్, అనూష ప్రేమించుకుని రెండు కుటుంబాలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే నిశ్చితార్థం కాన్సిల్ కావడంతోనే అనూషను మోతీలాల్ హత్య చేసి ఉంటాడని అనుమానాలు విన్పిస్తున్నాయి. మోతీలాల్ ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.
- Tags
- అనూష
Next Story

