Wed Mar 25 2026 04:51:45 GMT+0530 (India Standard Time)
అది ప్రచారమేనంటున్న మాజీ జేడీ

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన తన రాజీనామా ఆమోదించాకే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి వస్తానన్నది కేవలం ప్రచారమేనని లక్ష్మీనారాయణ తెలిపారు. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని, అది కూడా తన రాజీనామాను ఆమోదించిన తర్వాత మాత్రమేనన్నారు. తాను ఏ పార్టీలో చేరాలన్న విషయం ఆలోచించనే లేదన్నారు.
Next Story

