Thu Apr 02 2026 01:55:23 GMT+0530 (India Standard Time)
అజ్ఞాతవాసికి నో పర్మిషన్

ఆజ్ఞతవాసి సినిమాకి తెలంగాణలో ప్రీమియర్ షో లకి పోలీసులు అనుమతి నిరాకరించారు. రాత్రి ఒంటి గంట తర్వాత ఫ్యాన్స్ కోసం అజ్ఞాతవాసి సినిమా ప్రీమియర్ షోను ఏర్పాటు చేయాలని భావించారు. ఇందుకోసం భ్రమరాంబ, మల్లికార్జున ఆర్కే సినిమా థియేటర్లు ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే పోలీసులు ప్రీమియర్ షోలకు అనుమతించలేదు. తొక్కిసలాటలు జరిగే అవకాశమున్నందున నైట్ షో లకు పర్మిషన్ లేదని చెప్పారు. దీంతో పవన్ అభిమానులు నిరాశకు లోనయ్యారు.
- Tags
- అజ్ఞాతవాసి
Next Story

