Wed Apr 01 2026 01:27:44 GMT+0530 (India Standard Time)
అజ్ఞాతవాసి, జైసింహాకు అధికారుల షాక్...!

తెలుగు సినిమా పరిశ్రమకు ఆదాయపు పన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. సంక్రాంతికి విడుదలయిన సినిమాల నిర్మాతల ఇళ్లు, ఆఫీస్ లపై ఐటీ శాఖ దాడులు చేస్తోంది. ఈరోజు ఉదయం నుంచి ఈ దాడులు జరుగుతున్నాయి. నిర్మాతలు సి. కల్యాణ్, రాధాకృష్ణలతో పాటు మరో ఆరుగురు నిర్మాతల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. రాధాకృష్ణ పవన్ కల్యాణ్ తో అజ్ఞాత వాసి సినిమా తీశారు. అలాగే సి. కల్యాణ్ బాలకృష్ణ నటించిన జై సింహాను నిర్మించారు. ఈ నేపథ్యంలో భారీ వసూళ్లు చేశాయని భావించిన ఐటీ శాఖ అధికారులు ఈ నిర్మాతల ఇళ్లు, ఆఫీస్ లపై దాడులు చేస్తున్నారు.
Next Story

