అజ్జూ భయ్యాకు అవమానం...!

భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌కు హెచ్‌సీఏ స్పెషల్ జనరల్ మీటింగ్‌కు అవమానం జరిగింది. ప్రత్యేక సమావేశానికి వచ్చిన అజార్‌ను, సమావేశంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, అతనికి వివరణ ఇచ్చేందుకు కూడా ఎవరూ ఆసక్తి చూపకపోవడం, చాలాసేపు అజార్, వారి రిప్లే కోసం ఎదురుచూస్తూ ఉండటం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది.
అజార్‌కు మద్దతుగా గళమెత్తిన సస్పైండైన ఈసీ మెంబర్....
గతంలో హెచ్‌సీఏ అవినీతిపై అలుపెరగని పోరాటం చేసిన బాబురావు సాగర్, అజార్‌ను ఎందుకు సమావేశానికి రానివ్వరని అధ్యక్షుడిని ప్రశ్నించాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా, రాష్ట్రం తరపున ఆడి, ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న అజార్‌ను సమావేశంలోకి అనుమతించాల్సిందేనని ఆయన పట్టుబట్టారు.
అజార్ టీసీఏ బ్రాండ్ అంబాసిడర్...
అజారుద్దీన్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నాడని, హెచ్‌సీఏకు వ్యతిరేకంగా ఉన్న గురువారెడ్డితో కలిసి పనిచేస్తున్నాడని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ వివేక్, అజారుద్దీన్‌ను అనుమతించకపోవడంపై వివరణ ఇచ్చారు. అయితే, దీనిపై సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆయన తెలంగాణ ప్రీమియర్ లీగ్‌కు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని మన్నె గోవర్థన్ రెడ్డిదని స్పష్టం చేశారు. అయితే, అజార్, తాను ఏ లీగ్‌తో అసోసియేట్ కాలేదని కొందరు సభ్యులు చెప్పారు.
శివలాల్ యాదవ్ జోక్యం...
ఈ వ్యవహరంపై శివలాల్‌యాదవ్, వివేక్‌తో మాట్లాడి అజారుద్దీన్‌ను లోపలికి తీసుకురావడంతో వివాదం సద్దుమణిగింది. అయితే, అజారుద్దీన్‌ను లోపలికి అనుమతించిన సమయంలోనే విహెచ్ ఘాటు వ్యాఖ్యలు చేయడమే కాకుండా, మైక్ విరిగొట్టడంతో సమావేశం వాయిదా పడింది.
- Tags
- అజారుద్దీన్

