Fri Oct 11 2024 09:21:49 GMT+0000 (Coordinated Universal Time)
రికార్డులను బ్రేక్ చేయనున్న వైఎస్ షర్మిల
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్రను వచ్చే నెల ఐదో తేదీన ముగించనున్నారు. పాలేరు నియోజకవర్గంలో ముగింపు సభ ఉంటుంది
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తన పాదయాత్రను వచ్చే నెల ఐదో తేదీన ముగించనున్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల 2021 అక్టోబరు 20వ తేదీన పాదయాత్రను ప్రారంభించారు. ఆమె ఏడాదిన్నర పాటు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. అయితే ఆమె పాదయాత్రలో చేస్తున్న విమర్శలు వివాదాస్పద మయ్యాయి. కేసీఆర్ తో పాటు తాను పర్యటించిన ప్రాంతాల్లో ఎమ్మెల్యేలను, మంత్రులపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఇటీవల నర్సన్నపేటలో పాదయాత్రకు బ్రేక్ పడింది.
రెండేళ్ల క్రితం...
తిరిగి హైకోర్టు తీర్పు ద్వారా ఆమె పాదయాత్రను నర్సన్నపేట నుంచి ప్రారంభించారు. ఈ నెల 20న వైఎస్ షర్మిల పాదయాత్ర పాలేరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టనుంది. ఆ తర్వాత మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో పాదయాత్ర ముగించుకుని తిరిగి పాలేరు నియోజకవర్గం చేరుకుని ప్రజాప్రస్థానం పాదయాత్రను ముగించనున్నారు. మార్చి ఐదో తేదీన పాదయాత్ర ముగింపు సభకు పార్టీ నేతలు భారీగా సన్నాహాలు చేస్తున్నారు.
పాలేరు నియోజవర్గంలో ముగింపు...
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న పాలేరు నియోజకవర్గంలోనే వైఎస్ షర్మిల తన పాదయాత్రను ముగిస్తుండటం విశేషం. ఏడాదిన్నరగా ప్రజాప్రస్థానం పేరిట 4,111 కిలోమీటర్ల మేర వైఎస్ షర్మిల పాదయాత్ర చేసినట్లవుతుంది. ఒక్క పాలేరు నియోజకర్గంలోనే పథ్నాలుగు రోజుల పాటు పాదయాత్ర చేయనున్నారు. తెలంగాణ అంతటా పర్యటించడమే కాకుండా అత్యధికంగా నాలుగువేల కు పైగా కిలోమీటర్లు నడిచిన వైఎస్ షర్మిల రికార్డులను బ్రేక్ చేశారు. మరో రాజకీయ నేత ఎవరూ ఇన్ని వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయలేదు.
Next Story