Mon Mar 23 2026 05:21:48 GMT+0530 (India Standard Time)
రేపు వైసీపీలో వసంతం

కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత వసంత కృష్ణ ప్రసాద్ రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన ముహూర్తం నిర్ణయించారు. రేపు ఉదయం వైఎస్ జగన్ కైకలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ ఫ్యాన్ పార్టీ కండువాను కప్పుకోనున్నారు. వసంత కృష్ణ ప్రసాద్, మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు. ఆయన చేరికతో కృష్ణా జిల్లాలో ఫ్యాన్ పార్టీ బలం మరింత పెరుగుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చినా వసంత రేపు వైసీపీలో చేరేందుకు సిద్ధమయిపోవడం గమనార్హం.
- Tags
- andhrapradesh
- ap politics
- chief minister
- kaikaluru
- krishna district
- nara chandrababu naidu
- telugudesam party
- vasantha krishna prasad
- y.s.jagan mohan reddy
- ysrcp
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్
- కృష్ణా జిల్లా
- కైకలూరు
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- ముఖ్యమంత్రి
- వసంత కృష్ణ ప్రసాద్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
Next Story

