Tue Mar 24 2026 06:10:30 GMT+0530 (India Standard Time)
వైసీపీపై సంచలన విషయాలు బయటపెడ్తాం

వైసీపీపై సంచలన విషయాలు త్వరలో బయటపెడ్తామని ఏపీ ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కుటుంబరావు చెప్పారు. అగ్రిగోల్డ్ డీల్ చెడిపోవడానికి కారణం వైసీపీయే కారణమని ఆయన ఆరోపించారు. 18 లక్షల మంది అగ్రిగోల్డ్ లబ్దిదారుల ఉసురు వైసీపీకి తగులుతుందని ఆయన శాపనార్థాలు పెట్టారు. కేసుల పేరుతో జీ గ్రూపును వైసీపీయే బెదరగొట్టిందన్నారు. వైసీపీ రాక్షస క్రీడవల్లనే అగ్రిగోల్డ్ వ్యవహారం నిలిచిపోయిందన్నారు. త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటామని, వైసీపీ బెదిరింపులకు సంబంధించిన అన్ని విషయాలనూ త్వరలో బయటపెడతామని కుటుంబరావు చెప్పారు.
Next Story

