Tue Mar 24 2026 06:06:28 GMT+0530 (India Standard Time)
పట్టాలపై వైసీపీ

వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యేక హోదా సాధన కోరుతూ, ఢిల్లీలో ఎంపీల దీక్షకు మద్దతుగా వైసీపీ నేడు రైల్ రోకో కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. విజయవాడ, తూర్పుగోదావరి, తిరుపతి వంటి చోట్ల రైల్ రోకో కార్యక్రమాన్ని వైసీపీ కార్యకర్తలు చేపట్టారు. దీంతో కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని చోట్ల ఆందోళన చేస్తున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న ఇద్దరు ఎంపీలు మిధున్ రెడ్డి, అవినాష్ రెడ్డిల ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఇద్దరికీ షుగర్ లెవెల్స్ పడిపోయాయని వైద్యులు చెబుతున్నారు. ఎంపీల ఆమరణ దీక్ష నేటికి ఆరోరోజుకు చేరుకుంది.
Next Story

