వైసిపి ఎంపీల రాజీనామా.......టిడిపి కి సంకటం

ఏపీకి హోదా కోసం వైసిపి ఎంపీల రాజీనామా టిడిపి కి సంకటంగా మారింది. ప్రత్యేక హోదా అంశంలో వైఎస్సాఆర్ పార్టీకి మైలేజ్ రాజీనామాలతో ప్రజల్లో పెరుగుతుందని భావించి ముందుగానే కొద్దిరోజులుగా టిడిపి ఎదురుదాడి మొదలు పెట్టింది. అధినేత చంద్రబాబు నుంచి మంత్రులు ఎంపీల వరకు అంతా వైసిపి తీసుకున్న నిర్ణయం డ్రామా గా అభివర్ణిస్తూ పదేపదే చెప్పుకొస్తున్నారు. ఎన్నికలు జరగని రాజీనామాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వైసిపి ఎంపీలు త్యాగాన్ని ఆ పార్టీ అధినేత జగన్ కీర్తిస్తున్నారు. దమ్ముంటే టిడిపి ఎంపీలు రాజీనామాలు చేయాలని 25 మంది పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేయడం వల్ల దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని జగన్ తన పాదయాత్రలో జనం ముందు చెబుతున్నారు.
మీ సర్టిఫికెట్ మాకెందుకు అంటున్న ఎంపీలు ...
తమ పార్టీ ఎంపీలు ఇచ్చిన రాజీనామాలపై చంద్రబాబు లోకేష్ సర్టిఫికెట్లు ఎవరికీ కావాలని వైసిపి ఎంపీ అవినాష్ రెడ్డి , మిధున్ రెడ్డి , మేకపాటి అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆశిస్తే తమతో పాటు రాజీనామాలు చేసి ఆమోదించుకోవాలని కోరుతున్నారు. మరోవైపు విలువ లేని రాజీనామాలు ఎందుకంటూ ఎపి ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి, ఎంపీ కేశినేని నాని విమర్శలకు దిగారు. ఎన్నికలు ఏడాది లోపు జరిగేలా ఉంటే ఎవరైనా రాజీనామాలు చేసినా ఉపఎన్నికలు రావనే వైసిపి డ్రామాకు తెరతీసింది అని వారు ఆరోపించారు. పార్లమెంట్లో పోరాడాలిసింది పోయి కేంద్రం చెప్పినట్లు వైసిపి నడుస్తుందని ఏమి సాధిస్తారని కేఈ ప్రశ్నించారు. ప్రజలను వైసిపి మోసం చేస్తుందని కేశినేని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు ఎవరి వాదన వారు వినిపిస్తూ మరోసారి గందరగోళ రాజకీయానికి తెరలేపారు.
లోకసభ స్పీకర్ వైస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించిన తరువాత, ఒక వేల ఉపఎన్నికలు గనుక వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే దాని పై పాలక తెలుగుదేశం పార్టీ ముళ్ల గుల్లాలు పడుతుంది
