Mon Mar 16 2026 02:00:54 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైసీపీ కౌంట్ పెరిగింది..!

అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తిప్పేస్వామి ప్రమాణస్వీకారం చేశారు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి గెలిచిన ఈరన్న అఫిడవిట్ లో తనపై ఉన్న కేసులు చూపించలేదు. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు ఆయన శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేసింది. రెండోస్థానంలో నిలిచిన తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా కొనసాగించాలని స్పష్టం చేసింది. దీంతో ఇవాళ తిప్పేస్వామి మడకశిర ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలోని తన కార్యాలయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా తిప్పేస్వామి మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, కొంచెం ఆలస్యమైనా న్యాయం గెలిచిందని పేర్కొన్నారు.
Next Story

