Thu Mar 19 2026 19:52:00 GMT+0530 (India Standard Time)
కేరళకు వైసీపీ ఎమ్మెల్యేల సాయం

వరదలతో అతలాకుతలం అయిన కేరళకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమవంతు సహకారం అందించారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నెల జీతాన్ని కేరళకు విరాళంగా అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. తమ నెల వేతనం మొత్తాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించాలని కోరారు. ఇప్పటికే పార్టీ తరుపున జగన్ రూ.కోటి విరాళం ప్రకటించగా, ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రత్యేకంగా కోటి విరాళం ప్రకటించారు.
Next Story

