Thu Feb 06 2025 17:15:52 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి ఘటనలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రమేయం ఉందని తేలడంతో ఆయనను [more]
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి ఘటనలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రమేయం ఉందని తేలడంతో ఆయనను [more]

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి ఘటనలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రమేయం ఉందని తేలడంతో ఆయనను పోలీసులు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, నిజం నిలకడ మీద తెలుస్తుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. తాను ఎంపీడీవో సరళ ఇంటికి కూడా వెళ్లలేదన్నారు. విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు. కాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్ తో నెల్లూరులో ఉద్రిక్తత నెలకొంది.
Next Story