Wed Mar 25 2026 03:31:37 GMT+0530 (India Standard Time)
వైసీపీ నేత అరెస్ట్... పల్నాడులో ఉద్రిక్తత

పిడుగురాళ్ల మున్సిపాలిటీలో భారీగా పెంచిన ఇంటి పన్నులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గురజాల నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. దీంతో పోలీసులు వీరిపై ఉక్కుపాదం మోపారు. మహేష్ రెడ్డితో పాటు మరికొందరు నేతలను అరెస్ట్ చేశారు. కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురజాల నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతోందని, కేవలం పిడుగురాళ్ల మున్సిపాలిటీలోనే టీడీపీ నేతలు రూ.5 కోట్ల కుంభకోణం చేశారని మహేష్ రెడ్డి ఆరోపించారు. కొందరు పోలీసు అధికారులు టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
Next Story

