Tue Mar 24 2026 03:46:25 GMT+0530 (India Standard Time)
శ్రీనివాస్ కు ఏమైనా జరిగితే...

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బోత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని శ్రీనివాస్ ఆరోపించిన నేపథ్యంలో ఢిల్లీలో వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ... ఈ ఘటనలో నిందితుడితో పాటు సాక్షి కూడా శ్రీనివాసరావే అని, ఆతడి వెనక ఎవరు ఉన్నారో చెప్పాల్సింది అతడే అన్నారు. నిందితుడి వెనక ఎవరు ఉన్నారో తేలాలంటే శ్రీనివాసరావు సజీవంగా ఉండాలన్నారు. సాక్షాలు మాయం చేసేందుకు శ్రీనివాస్ కు ప్రాణహాని ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ధర్యాప్తు చేయాలని కోరారు.
Next Story

