Tue Mar 24 2026 05:08:15 GMT+0530 (India Standard Time)
ఏచూరితో వైసీపీ ఎంపీల భేటి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిశారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం, మంత్రుల వ్యాఖ్యలు, విచారణ తీరును వారు ఏచూరి దృష్టికి తీసుకువచ్చారు. ఢిల్లీ వెళ్లిన వైసీపీ నేతలు ఈ ఘటనపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కోరిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కూడా వారు కలిసి వినతిపత్రం ఇవ్వాలని భావిస్తున్నారు.
Next Story

