Tue Mar 24 2026 02:07:08 GMT+0530 (India Standard Time)
జాతీయ నేతలతో వైసీపీ నేతల భేటి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై విచారణ తీరుపై వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపిస్తూ వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఉదయం వారు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని కోరారు. ఇవాళ సాయంత్రం వారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, ముఖ్యనేత డి.రాజాను కలిశారు. హత్యాయత్నం జరిగిన తీరు, విచారణ జరుగుతున్న విధానాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు.
Next Story

