Fri Mar 20 2026 00:50:41 GMT+0530 (India Standard Time)
హరికృష్ణకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతల నివాళి

రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన నందమూరి హరికృష్ణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నివాళి అర్పించారు. గురువారం వైసీపీ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, అంబటి రాంబాబు తదితరులు హరికృష్ణ నివాసానికి వచ్చి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. నిక్కచ్చిగా మాట్లాడే మంచి మపసున్న వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు.
Next Story

