Tue Mar 24 2026 15:19:10 GMT+0530 (India Standard Time)
పోలీసుల విచారణకు వైసీపీ నేత

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం తర్వాత ఆ పార్టీ నేత జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు అందడంతో ఇవాళ ఆయన పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. హత్యాయత్నం ఘటన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... నిందితుడు టీడీపీ కార్యకర్త అని చెప్పి టీడీపీ సభ్యత్వ కార్డును చూపించారు. అయితే, అతడి సభ్యత్వ కార్డు నకిలీదని, జోగి రమేశ్ తమ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేశారని టీడీపీ నేత వర్ల రామయ్య గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ ఆయన విచారణకు హాజరుకానున్నారు.
Next Story

