Sun Mar 22 2026 17:03:29 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైసీపీ నేత దారుణ హత్య

అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలతో మరో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత హత్యకు గురయ్యారు. వైసీపీ నేత కేశవరెడ్డిపై ఇవాళ ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాడ్ లతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాల పాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కేశవరెడ్డి ఇంతకుముందు సర్పంచ్ గా కూడా పనిచేశారు. అయితే, తన భర్త హత్యలో మంత్రి పరిటాల సునీత సోదరుడు బాలాజీ ప్రమేయం ఉందని మృతుడి భార్య రాజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story

