Sat Mar 21 2026 07:20:45 GMT+0530 (India Standard Time)
జగన్ పై దాడికి ఎవరు ప్రయత్నించారో తెలియాలి..!

ఆపరేషన్ గరుడ జరుగుతొందని ఆరోపణలు చేస్తున్న సినీ నటుడు శివాజిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆపరేషన్ గరుడ ఎవరు ఆపరేట్ చేస్తున్నారో పెయిడ్ ఆర్టిస్ట్ చేప్పాలని డిమాండ్ చేశారు. 2010 ఉప ఎన్నికల్లో రాజకీయ క్రీడలో భాగంగా చంద్రబాబు నాయుడు మహారాష్ట్రలో ధర్నా చేశారని.. దానిపై అక్కడ కేసు నమోదైందన్నారు. ఇది అప్పట్లో కాంగ్రెస్, టీడీపీ కలిసి ఆడిన ఒక మహా డ్రామా అని ఎద్దేవా చేశారు. అది స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసని, బెయిల్ తీసుకుంటే అసలు సమస్యే ఉండని దానికి రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. గుంటూరులో వైఎస్ జగన్ సై రెక్కీ జరిగిందని ఇంతకుముందు అన్నారని, ఇప్పుడు మళ్లీ జగన్ పై దాడి జరగబోతుందని అంటున్నారని, జగన్ పై దాడి చేయడానికి ఎవరు ప్రయత్నించారో పెయిడ్ ఆర్టిస్ట్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తే తెలుస్తుందని పేర్కొన్నారు.
Next Story

