Sat Jan 31 2026 12:49:03 GMT+0000 (Coordinated Universal Time)
వైసీసీలో చేరుతున్నా... ప్రకటించిన సీనియర్ నేత

ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాజమహేంద్రవరానికి చెందిన ఆయన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు శిష్యుడిగా కొనసాగారు. తన మద్దతుదారులు, అనుచరులతో శుక్రవారం లేదా ఆదివారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. తాను భేషరతుగా పార్టీలో చేరుతున్నానని, పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ లో పనిచేసి శివరామసుబ్రహ్మణ్యానికి ఆర్య వైశ్య సామాజికవర్గంలో మంచి పట్టు ఉంది. ఆయన రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని వైసీపీ నేతలు ఆశిస్తున్నారు.
Next Story

