Mon Mar 23 2026 14:47:16 GMT+0530 (India Standard Time)
జగన్ పై పెట్టిన కేసులన్నీ ఉత్తుత్తివే

కేంద్రమంత్రి రామ్ దాస్ అధవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ పై పెట్టినకేసులన్నీ కాంగ్రెస్ హైకమాండ్ పెట్టినవేనని, అవి ఇంకా నిరూపణ కాలేదని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలోకి రావాలనుకుంటే తాము ఆహ్వానిస్తామని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే టీడీపీ కూడా ఎన్డీఏ నుంచి వైదొలగకుండా ఉండాల్సిందన్నారు. ఇప్పటికైనా మించి పోయింది లేదని, టీడీపీ తిరిగి ఎన్డీఏలోకి వస్తేవ బాగుంటుందని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏతో చేతులుకలపాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ ఎన్డీఏలోకి రాకుంటే వైఎస్సార్సీపీని ఆహ్వానిస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు.
Next Story

