Tue Mar 24 2026 13:42:28 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ముందే రాజీనామా చేసిన వైసీపీ ఎంపీ

వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసేశారు. పార్లమెంటు సమావేశం ప్రారంభం కాకముందే ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ సుమిత్రా మహాజన్ కు పంపారు. వాస్తవానికి లోక్ సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత వైసీపీ ఎంపీలందరూ మూకుమ్మడిగా రాజీనామా చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు వారు రాజీనామా లేఖను కూడా సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు. అయితే మిధున్ రెడ్డి మాత్రం ముందుగానే తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో సుమిత్రా మహాజన్ కు పంపడం చర్చనీయాంశంగా మారింది.
Next Story

